తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వైయస్‌ఆర్‌సీపీ నాయకుల నిరసన

ప్రకాశం(సింగరాయకొండ) వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహనరెడ్డిపై అక్రమ కేసులకు నిరసనగా  సింగరాయకొండ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అద్యక్షుడు తాండ్రరామ్మూర్తి తహశీల్దార్‌  షేక్‌ దావూద్‌హుస్సేన్‌ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టి జిల్లా ప్రధాన lకార్యదర్శి యన్నాబత్తిన చిన్నా, మండల యువజన విభాగం అధ్యక్షుడు శీలం రాము, జిల్లా కార్యవర్గ సభ్యుడు జి భాస్కర్, పట్టణ అధ్యక్షుడు షేక్‌ జానీబాషా, మూలగుంటపాడు, పాకల గ్రామ కమిటీ అధ్యక్షులు పోలక వెంకటేశ్వరరెడ్డి, కేశవరపు కృష్ణారెడ్డి, మండల మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ నౌషాద్, మాజీ సర్పంచ్‌ పామర్తి మాధవరావు, పాతసింగరాయకొండ దేవస్దాన కమిటీ మాజీ చైర్మన్‌ శీలం రమణయ్య, గండవరపు పిచ్చిరెడ్డి, బల్లెల ప్రభాకరరెడ్డి, మనోహర్, బెల్లంకొండ కొండలరావు, షేక్‌ రియాజ్, బొట్టా బాలకృష్ణ, షేక్‌ కరీ, తదితరులు పాల్గొన్నారు.

Back to Top