టీడీపీ అవినీతికి నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ అర్ధనగ్న ప్రదర్శన

ప‌శ్చిమ గోదావ‌రి:  టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అవినీతికి వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన చేపట్టింది. రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో  అవినీతిలో పాలకొల్లు మొదటిస్థానంలో ఉందని వైయస్‌ఆర్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుర్రం నాగ‌బాబు విమ‌ర్శించారు.  ఆయన ఆధ్వర్యంలో టీడీపీ అవినీతికి నిరసనగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైయ‌స్ఆర్‌సీపీ  కార్యర్తలు పాల్గొన్నారు. అవినీతిపై దమ్ము,ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్‌ విసిరారు. అభివద్ధి పనుల్లో కమిషన్ల  కోసం కాంట్రాక్టర్లపై టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో డెల్టా ఆధునికీకరణ పనులు కుంటుపడాయని,  ఎమ్మెల్యే రామానాయుడుకు ముడుపులు చెల్లించుకోలేక కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని విమర్శించారు.
 
Back to Top