<br/><strong>– వైయస్‌ఆర్‌సీపీ నేతలు కిలారి రోశయ్య, లాల్‌పురం రాము</strong><br/>గుంటూరు: కాపు రిజర్వేషన్లు సుప్రీం పరిధిలో ఉన్నాయనే వైయస్ జగన్ చెప్పారని, కాపు రిజర్వేషన్లను వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకించడం లేదని వెయస్‌ఆర్‌సీపీ నేతలు కిలారి రోశయ్య, లాల్‌పురం రాము పేర్కొన్నారు. కాపులకు రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి, ఇప్పుడు వైయస్ జగన్ కాపులకు పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. ముద్రగడ పద్మనాభంను హౌస్ అరెస్టు చేసినప్పుడు, వారి కుటుంబ సభ్యులను పోలీసులు కొట్టినప్పుడు వైయస్ జగన్ ఆ కుటుంబానికి అండగా నిలిచారన్నారు. వైయస్ జగన్ అండగా నిలబడిన విషయం ముద్రగడ మరచిపోవడం దారుణమన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తేనే కాపులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ముద్రగడ వెనుకున్న టీడీపీ నేతలే ఆయనతో అలా మాట్లాడిస్తున్నారని విమర్శించారు.