శాసనసభా వ్యవహారాలను ఎన్టీఆర్ భవన్ కు తాకట్టుపెడుతున్నట్టుగా కనపిస్తోందని వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ టీడీపీ సర్కార్ పై ధ్వజమెత్తారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పై నోటీసులు ఇచ్చామన్న ఆయన...పాలక పక్షానికి మద్దతుగా స్పీకర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం మంచిది కాదన్నారు. తమ అవిశ్వాస తీర్మానంతోనైనా స్పీకర్ లో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని కాకినాడలో జరిగిన వీడియో సమావేశంలో నెహ్రూ తెలిపారు.<br/>వీఆర్ఏలు నెలన్నరగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. తక్షణమే వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న చోట పూర్తి స్థాయి ఉద్యోగులుగా వీఆర్ఏలను నియమించాలని విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.