అనంతలో పోలీసుల ఓవరాక్షన్

అనంతపురంలో టీడీపీ నేతల అరాచకాలు పరాకాష్టకు చేరాయి. నేడు కనగానపల్లె ఎంపీపీ ఉపఎన్నిక నేపథ్యంలో అడ్డదారులు తొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని మంటగల్పుతున్నారు. పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శించారు. రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ, ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, నేతలు అనంత వెంకట్రామిరెడ్డి తదితరులను పోలీసులు ఎన్నికలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై వైయస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మీడియాపై ఆంక్షలు పెట్టి, వైయస్సార్సీపీ నేతలను పది కి.మీ. దూరంలో నిలిపేయడంపై పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. నిష్పక్షిపాతంగా ఎంపీపీ ఉపఎన్నిక జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈవిషయంపై టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఏపీ డీజీపీకి లేఖ కూడా రాశారు. 
Back to Top