బాబును అరెస్ట్ చేయాలంటూ అర్ధనగ్న ప్రదర్శన

జీడిమెట్ల (హైదరాబాద్) : ఓటుకు నోటు వ్యవహారంలో కీలక సూత్రదారి అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును వెంటనే అరెస్టు చేయాలిని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. జీడీమెట్లలోని ఏపీఐఐసీ కాలనీలో ఉన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఎదుట కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నేత  సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రేవంత్ కేసులో బలమైన సాక్ష్యాదారాలున్నందున బాబును అరెస్టు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
Back to Top