- జననేత హత్యకు భయంకర కుట్ర...- వాస్తవాలను దాచి..అసత్యాల ముసుగు..- వైయస్ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై నిష్పక్షపాత విచారణ చేయించండిఅమరావతి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటన ముమ్మాటికి ప్రజాస్వామ్యంపై దాడి అని వైయస్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ ఘటన పై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండు చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి హత్యాయత్నం ఘటనపై స్పందించారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ అనుసరించిన వ్యవహరాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో అక్టోబర్ 25న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఒక భయకరమైన కుట్ర కోణం కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా తేటతెల్లమవుతోంది. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే ఖండించకుండా, నిజాలను దాచిపెట్టి అసత్యాలను ప్రచారాలు చేసి, అసంపూర్తిగా దర్యాప్తు జరిపి ప్రజలను తప్పదోవ పట్టించే చర్యలకు సీఎం చంద్రబాబు, ప్రభుత్వం అధికార యంత్రాంగం పూనుకుంది.నిజాలను కప్పిపుచ్చి అవాస్తవాలుః–ఘటన జరిగిన తర్వాత వైయస్ జగన్ విమానంలో హైదరాబాద్‌కు మధ్యాహ్నం 2 గంటలకు రాకమునపే ఏపీ డీజీపీ మీడియా సమావేశాని ఏర్పాటు చేసి నిందితుడు జగన్ అభిమానిగా పేర్కొనడం,ఆ నిందితుడు ఎస్సీ కులానికి చెందిన వాడని ప్రత్యేకంగా ప్రస్తావించారు.–ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా..?1.హత్యాయత్నం జరిగిన కేవలం గంటన్నర సమయంలోనే డీజీపీ విశాఖపట్నంలో లేకపోయినా నిందితుడి కులం,ఇతర కీలకమైన వివరాలు ఎలా సేకరించారు..?2.సరైన ఆధారాలు లేకున్నా నిందితుడు జగన్ అభిమాని అని డీజీపీ ఎలా చెప్పగలిగారు? డీజీపీ పేర్కొన్న అవాస్తవ వ్యాఖ్యలు విన్న తర్వాత ఆ సమావేశం అసత్యాన్ని ప్రచారం చేయడానికి పెట్టారని అర్థమవుతోంది.3. ఘటన జరిగిన గంటలోపే నిందితుడు, జగన్ ఫొటో ఉన్న సంక్రాంతి పండుగ పోస్టర్‌ను టీడీపీకి చెందిన కొన్ని మీడియా సంస్థలు విడుదల చేశాయి. ఆ పోస్టరుతో నిందితుడు జగన్ అభిమానే అని ముద్ర వేయాలని చూశాయి. నిందితుడి అధికారిక ఫొటోను విడుదల చేయకముందే అతని నేపథ్యం, సంవత్సరం కిందటి పోస్టరును టీడీపీకి సంబంధించిన మీడియా సంస్థలు కేవలం ఘటన జరిగిన గంటలోపే ఎలా సేకరించాయి?4. సామజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న ఫొటోలో రోజాపూవ్వు ఉంటే, మొదటి చూపించిన హెచ్‌డి ఫొటోలో ఆ పూవ్వు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.5.బీజేపీ, జనసేన, తెరాస పార్టీ నాయకులు వైయస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించారు కాబట్టి వారు కూడా కుట్రలో భాగమని చంద్రబాబు ఆరోపించారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు జరిగిన దాడిని ఖండిస్తూ వైయస్ జగన్‌ను పరామర్శిస్తే దానిని చంద్రబాబు ఒక కుట్రగా ఏ కారణంతో అభివర్ణిస్తారు? మరి అదే కారణంతో తన మిత్రపక్ష పార్టీకి చెందిన జానారెడ్డి,జైపాల్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి(తెలంగాణ కాంగ్రెస్) నాయకులు వచ్చి జగన్‌ను పరామర్శిస్తే కుట్రగా భావించలేదు ఎందుకని?6.రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హత్యాయత్నం జరిగి 12 గంటలు దాటిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఖండించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తనా శైలి ఇలానే ఉంటుందా? అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుకి మద్దతుగా రోడ్డమీదకు వచ్చి ధర్నా చేశారు..7. చంద్రబాబు జరిగిన ఘటనను చులకన చేస్తూ కేవలం 0.5 సెం.మీ మాత్రమే గాయం అయిందని హేళనగా మాట్లాడారు. వైద్యులు గాయం 3 సెం.మీ ఉందని, 9 కుట్లు అవసరమని చెప్పితే, చంద్రబాబు నాయుడు మాత్రం గాయం కేవలం 0.5 సెం.మీ మాత్రమే ఏర్పడిందని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించాల్సిన అవసరం ఏంటి?8.తక్కువ భద్రత కలిగిన పాదయాత్రలోనే వైయస్ జగన్‌పై నిందితుడు దాడి చేసి ఉండవచ్చు కాదా, మరి ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఎందుకు చేశారు? టీడీపీ హత్యాయత్నాన్ని పథకం ప్రకారమే ఎయిర్‌పోర్టులో చేయించి ఆ నిందను కేంద్రం మీదకు నెట్టివేయాలని ప్రయత్నించిందా?9.అదే రోజు రాత్రి 9.30 గంటలకు పోలీసులు 11 పేజీలతో కూడిన ఒక లేఖను విడుదల చేసి అది నిందితుడి జేబులో దొరికిందని పేర్కొన్నారు.. అసలు ఒక్క మడత కూడా లేకుండా, చిరగకుండా ఒక వ్యక్తిని 11 పేజీలను జేబులో ఎలా పెట్టుMýంంటాడు?, అసలు నిజాన్ని పక్కదోవ పట్టించేందుకే లేఖను మార్చారా? ఎందుకంటే 1వ పేజీ నుంచి 11వ పేజీ వరుకు చేతిరాత వేర్వేరుగా ఉంది.10. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్ పరిపాలనా యంత్రాంగంతో మాట్లాడవచ్చని, ప్రభుత్వాధికారులు సమాచారాన్ని గవర్నర్‌కు పంపించి ఆ తర్వాత దానిని సీఎంకు రిపోర్టు చేయవచ్చని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. చంద్రబాబు నాయుడు గవర్నర్ అధికారాన్ని,ప్రోటోకాల్ గురించిఎందుకు ప్రశ్నిస్తున్నారు? జరిగిన ఘటన నుంచి దృష్టిని మళ్లించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారా?11. నిందితుడు శ్రీనివాస్, ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని హత్య చేయడానికి ప్రయత్నించడాడని రిమాండ్ రిపోర్ట్‌ల స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించిన డీజీపీపై టీడీపీ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలేమిటీ..? రెస్టారెంట్ యాజమాని హర్షవర్థన్ చౌదరి(నిందితుడు పనిచేస్తున్న రెస్టారెంట్)కి,మంత్రులు నారా లోకేష్,గంటా శ్రీనివాస్‌లతో ఉన్న సంబంధాన్ని రిమాండ్ రిపోర్ట్‌లో ఎందుకు పేర్కొనలేదు?12. చంద్రబాబు, టీడీపీ నేతలు..జగన్‌పై దాడి ఆపరేషన్ గరుడలో భాగమని పేర్కొన్నారు. నిఘా వర్గాల దగ్గర సైతం లేని సమాచారం ఒక సినీ నటుడికి ఎలా తెలిసింది.? పోలీసులు నటుడు శివాజీని ఎందుకు విచారించడంలేదు?13.వైయస్ జగన్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తారన్న సమాచారం ముందుగానే తెలుసుకున్న శ్రీనివాస్..ప్రణాళిక ప్రకారం రెండు కత్తులను, లేఖను(పోలీసుల సమాచారం మేరకు) ఎయిర్‌పోర్ట్‌లోకి తెచ్చుకున్నాడని రిమాండ్ రిపోర్డ్‌లో పేర్కొన్నారు. నిందితుడి కాల్ డేటా, టీడీపీ నేతలతో జరిపిన సంభాషణలతో పాటు, నిందితుడి బ్యాంక్‌ఖాతాలో భారీగా డబ్బు ఉన్న విషయాన్ని పోలీసులు ఎందుకు దాచారు..?14.దాడి వెనుక ఉన్న కుట్రకోణాన్ని రిమాండ్ రిపోర్ట్‌లో ఎక్కడ ప్రస్తావించకపోగా, నిందితుడు జగన్ అభిమాని అని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. దాడి వెనుక కుట్రకోణంపై పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? కేసులోని విషయాలపై ముందే ఒక నిర్థారణకు వచ్చి, ఆ తర్వాత వాటిని నిరూపించడానికి దర్యాప్తు చేస్తుండటానికి కారణం ఏంటి..?