మాటలు అవసరం లేదు..నీటిని విడుదల చేయండి

వైయస్‌ఆర్‌ జిల్లా: ప్రజలకు మాటలు అవసరం లేదని, సాగు నీటిని విడుదల చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.  శ్రీశైలం జలాశయంలో నీరున్నా..పవర్‌ జనరేషన్‌ పేరుతో ప్రభుత్వం మొత్తం నీటిని తరలిస్తోందని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మండిపడ్డారు. సోమవారం కడప నగరంలో మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం జలాశయం నుంచి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు నీరు విడుదల చేయాలని డిమాండు చేశారు. రాజోలు రిజర్వాయర్‌ నుంచి 10 రోజుల క్రితం ఆర్భాటంగా నీరు విడుదల చేసి వెనక్కి తీసుకోవడం దారుణమన్నారు. రైతులు రోడ్లపైకి వస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. శ్రీౖశైలం నుంచి తెలుగు గంగ, వెలుగోడు రిజర్వాయర్, పైడిపాలెం ప్రాజెక్టులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండు చేశారు. నీటిని విడుదల చేయకపోతే ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. నీటిని విడుద‌ల చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు జిల్లా క‌లెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు.

 
Back to Top