<br/><br/>పశ్చిమ గోదావరి: టీడీపీ దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్‌పై వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఆళ్లనాని, అబ్బాయి చౌదరి మాట్లాడుతూ..దెందులూరులో చింతమనేని కనుసన్నల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని, గ్రావెల్ మైనింగ్ ద్వారా రూ.50 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారని కలెక్టర్‌కు వివరించారు. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని తెలిపారు. అక్రమ మైనింగ్‌పై విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు కోరారు.