<strong>– చంద్రబాబు డైరెక్షన్‌లోనే గరుడ పురాణం</strong><strong>– విజయవాడ సీపీకి వైయస్‌ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు</strong><strong>– థర్డ్ పార్టీచే విచారణ జరిపించాలని డిమాండు</strong><br/> విజయవాడ: వైయస్ జగన్‌పై హత్యాయత్నం చంద్రబాబు డైరెక్షన్‌లోనే జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు పేర్కొన్నారు. వైయస్ జగన్‌కు రక్షణ పెంచాలని, హీరో శివాజీ ముందస్తుగా మాట్లాడిన మాటలు..తదనుగుణంగా జరిగిన చర్యలపై సమగ్ర విచారణ చేపట్టాలని సోమవారం వైయస్‌ఆర్‌సీపీ నాయకులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, గౌతంరెడ్డి, తదితరులు విజయవాడ పోలీసు కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ..వైయస్ జగన్‌కు జనాదరణ పెరిగిందని హత్యాయత్నానికి పాల్పడ్డారని మండిపడ్డారు. వైయస్ జగన్‌పై ఏవిధంగా హత్యయత్నం జరిగిందో, ఇందుకు కుట్రదారులు, పాత్రదారులు ఎవరో తేల్చాలని, సినీ నటుడు శివాజీపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టారాజ్యంగా వైయస్ జగన్‌పై మాట్లాడుతున్నారని, వీరికి ఎల్లో మీడియా తోడై దాడులు చేస్తున్నారన్నారు. ఎయిర్ పోర్టు తమ పరిధిలో లేదని, కేంద్రం కుట్ర అని ఎందుకు అంటున్నారని, ఈ ప్రశ్నలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. డీజీపీ ఘటనపై వెంటనే స్పందించడం, ఇష్టం వచ్చినట్లు అధికార పార్టీ చెప్పినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని ముందు తెలిసి కూడా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కేవలం ప్రెస్‌మీడియాకే పరిమితమై చంద్రబాబు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. హీరో శివాజీని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టాలని పోలీసు కమిషనర్‌ను కలిశామన్నారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. హత్యయత్నం ఘటనపై థర్డ్ పార్టీతో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండు చేశారు.