గుంటూరుః అధికార టీడీపీ ప్రతిపక్షంపై ఉక్కుపాదం మోపుతోంది. ఇష్టానుసారంగా ఇంటి పన్ను పెంపు, గతంలో వేసిన రోడ్లకు మళ్లీ టెండర్లపై వైయస్‌ఆర్‌సీపీ చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయం ముట్టడికి వైయస్‌ఆర్‌సీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజా సమస్యలపై ధర్నాకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. గురజాల వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలు రామిరెడ్డి, రేపాల శ్రీనివాస్‌లను అరెస్ట్ చేసి రాజుపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.