ఆంధ్రలో రాక్షస పాలన

పశ్చిమగోదావరిః  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న సాగుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి విమ‌ర్శించారు. 
వైయస్‌ జగన్‌పై హత్యాయత్నాన్ని ప్రభుత్వం చిన్న ఘటనగా చిత్రీకరించిందన్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌  తర్వాతైనా పోలీసులు తీరు మారకపోవడం దురదృష్టకరమన్నారు. హత్యాయత్నం వెనుక ప్రభుత్వ పెద్దలున్నారు కాబట్టే నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. స్వతంత్ర దర్యాప్తుతోనే కుట్రదారులు బయలు కొస్తారని తెలిపారు.  దెందులూరు నియోజకవర్గంలో ప్రజలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, యువత, వృద్ధులు, విద్యార్థులు టీడీపీ నిరంకుశత్వ పాలన, దౌర్జన్యాలపై విసిగిపోయారన్నారు. ఉద్యోగులను కొట్టడం, బండ బూతులు తిట్టడం, అందరిపై దౌర్జన్యం చేయటం, జిల్లా, మండల అనే స్థాయి సైతం చూడకుండా చివరకు తన సమాచారాన్ని ప్రజలకు చేర వేసే విలేకరులపై సైతం బండ బూతులు తిట్టిన ఏకైక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. సాధారణ వ్యక్తిత్వం, ఉన్నత విలువలతో జీవించే వైయ‌స్ఆర్‌సీపీ  పెదపాడు మండల కన్వీనర్‌ అప్పన ప్రసాద్‌పై టీడీపీ ప్రభుత్వం ఓర్వలేక రౌడీషీట్‌ తెరవటం దుర్మార్గమన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఇసుక, భూదందా, మట్టి దందా జరుగుతున్నాయని అబ్బయ్య చౌదరి నేరుగా జేసీబీలను అడ్డుకుని జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి రెండు నెలలయినా జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకోకపోగా ఇది పెద్ద విషయం ఏమీ కాదని వ్యాఖ్యానించటం తనకెంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. వచ్చే ఏడాదికి కూడా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేరన్నారు. కాసుల కోసమే పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం చేపడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు ప్రజలు చెక్‌ పెడతారన్నారు. 
Back to Top