ప్రత్యేకహోదాపై టీడీపీ డ్రామాలు..

వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌...
ఢిల్లీః ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశాయని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ మండిపడ్డారు.ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అనైతికంగా కొనుగోలు చేసిన చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు పార్లమెంటులో డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తెలంగాణలో తెలుగు ప్రజలు బుద్ధి చెప్పినట్లే ఏపీ ప్రజలు కూడా చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్నారు. నిజాయతీ గల వ్యక్తి,  ధైర్యశాలి వైయస్‌ జగన్‌కు  ఏపీ ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేదలు,యువత, మహిళల, రైతుల అభివృద్ధి ఏవిధంగా కృషి చేశారో,గ్రామాభివృద్ధి ఎంత పాటుపడారో అదేవిధంగా వైయస్‌ జగన్‌ కూడా సుభిక్ష పాలన అందిస్తారని తెలిపారు.
 

తాజా వీడియోలు

Back to Top