ప్రజా గళం నుంచి వచ్చే మాట వైయస్‌ జగన్‌ సీఎం

చంద్రబాబు మారడు.. మేమే మారుతాం: ప్రజలు 
ఏ పని కావాలన్నా తెలుగుదేశం పార్టీకి లంచాలు
విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌
విశాఖపట్నం: చంద్రబాబు మారాను మారాను అంటే నమ్మి ఓట్లేశామని, ఈ సారి మేమే మారి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకుంటామని ప్రజలంతా చెబుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విశాఖలో అద్భుతంగా జరుగుతుందన్నారు. 260వ రోజు ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న వంశీకృష్ణ శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలు మళ్లీ ఊపిరి పీల్చుకోవాలంటే జననేత సీఎం కావాలని అన్ని సామాజికవర్గాల ప్రజలు పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని, ఈ సారి మేము మారి మిమ్మల్ని గెలిపించుకుంటామని ప్రజలంతా చెబుతున్నారన్నారు. విశాఖలో జరిగిన బహిరంగ సభ 25 సంవత్సరాల కాలంలో ఎన్నడూ జరగలేదని, వైయస్‌ జగన్‌ ప్రసంగం వినేందుకు ప్రజలంతా లక్షలాదిగా తరలివచ్చారని చెప్పారు. పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలంతా నాలుగున్నర సంవత్సరాల కాలంలో నరకం అనుభవించారన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకు లంచం ఇస్తే తప్ప ఏ పనీ జరగడం లేదన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే ప్రజల కోరికలు నెరవేరుతాయన్నారు. కడుపు నిండా తిండి దొరుకుతుందనే ఆశతో ప్రజలంతా పాదయాత్రకు తరలివస్తున్నారన్నారు. 
Back to Top