విలువల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదు

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచినవారిలో అయ్యన్నపాత్రుడు ఒకరు
విచారణ చేపడితే టీడీపీ అవినీతి ఆధారాలతో సహా నిరూపిస్తా
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నర్సీపట్నం కోఆర్డినేటర్‌ ఉమాశంకర్‌ గణేష్‌
విశాఖపట్నం: రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ నేతలకు లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ పేట్ల ఉమాశంకర్‌గణేష్‌ ధ్వజమెత్తారు. మంత్రి అయ్యన్నపాత్రుడు విలువల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి చెందుతారనే భయంతో టీడీపీ నేతలు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 241వ రోజు ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న ఉమాశంకర్‌గణేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. స్వర్గీయ ఎన్టీఆర్‌ దయతో ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్నపాత్రుడు చంద్రబాబుతో చేతులు కలిపి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచేందుకు సహకరించాడన్నారు. కేసులు అంటూ వైయస్‌ జగన్‌పై టీడీపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తప్పు చేయలేదు కాబట్టే వైయస్‌ జగన్‌ ఇప్పటికీ ధైర్యంగా విచారణ ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికీ 22 కేసుల్లో ఇరుక్కున్న చంద్రబాబు విచారణ ఎదుర్కోలేక స్టేలు తెచ్చుకొని బతుకుతున్నాడన్నారు. అవినీతి కేసులపై విచారణ జరిపిస్తే చంద్రబాబు జీవితాంతం జైల్లో ఉంటాడన్నారు. నర్సీపట్నంలో అవినీతి జరగలేదని మంత్రి అయ్యన్నపాత్రుడు అంటున్నారని, విచారణ చేపడితే నీరు–చెట్టు, మరుగుదొడ్ల నిర్మాణంలో చేసిన అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తామని సవాలు విసిరారు.
పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారు ఆరు రోజులుగా కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఉమాశంకర్‌ గణేష్‌ అన్నారు. ఎంతోమంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకోవడానికి తరలివస్తున్నారన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివస్తున్నారని, వారి సమస్యలు వింటూ జననేత ముందుకుసాగుతున్నారన్నారు. పాదయాత్రకు వస్తున్న ప్రజాధరణ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top