<strong>పెయిడ్ ఆర్టిస్టు శివాజీని అదుపులోకి తీసుకొని విచారించాలి</strong><strong>వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు</strong>ప్రకాశం: ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించలేని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు అన్నారు. చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టు నటుడు శివాజీని అదుపులోకి తీసుకొని లోతుగా విచారిస్తే హత్యాయత్నం కుట్రలన్నీ బయటపడతాయని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో సుధాకర్‌బాబు మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టులో గడ్డం గీసుకునే రేజర్ బ్లేడ్‌ను కూడా అనుమతించరని, కోడి పందెంలో వాడే కత్తిని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఆ కత్తి ఎలా లోకపలికి వెళ్లింది.. హత్యకు యత్నించిన నిందితుడి వెనుక ఎవరి హస్తం ఉందనేది తేలాలన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారు కాబట్టే వైయస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు కుయుక్తులతో కూడుకున్న రాజకీయాలకు వైయస్ జగన్‌పై హత్యాయత్నం అంతరభాగమన్నారు. ఇప్పటికైనా పెయిడ్ ఆర్టిస్టు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకొని అరెస్టు చేసి దర్యాప్తు చేయాలన్నారు. ఇంకా ఎక్కడెక్కడ దాడులు జరుగుతాయో తేల్చాలన్నారు. వైయస్ జగన్‌కు సెక్యూరిటీ పెంచాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఇంకా కొంతకాలమే సమయం ఉందని, కుట్రపూరిత రాజకీయాలు చేస్తాడనే అనుమానం కలుగుతుందని, అనుకున్నట్లుగానే హత్యాయత్నం చేయించాడన్నారు. చంద్రబాబు కుట్రదారులు, తాబేదారులు ప్రజాకోర్టులో శిక్ష అనుభవించక తప్పదన్నారు.