ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించే వరకు పోరాటం ఆగదు

పరిశ్రమ పూర్తి చేయడం వైయస్‌ జగన్‌ వల్లే సాధ్యం
నాలుగేళ్లుగా చంద్రబాబు సర్కార్‌ నిద్రపోతుందా
టీడీపీ దొంగ దీక్షలను ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరు
వైయస్‌ఆర్‌ జిల్లా: ఉక్కు పరిశ్రమ స్థాపించే వరకు పోరాటం ఆగదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్‌రెడ్డి అన్నారు. కడప ఉక్కు– ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ పోరాటం ఉధృతం చేసింది. ఈ నేపధ్యంలో వైయస్‌ఆర్‌ జిల్లాలో రోజుకో నియోజకవర్గంలో ధర్నా చేపడుతోంది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో మంగళవారం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ వస్తే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. 2006–07 సంవత్సరంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. దాన్ని పూర్తి చేయడం ఒక్క వైయస్‌ జగన్‌ వల్లే సాధ్యమన్నారు. చంద్రబాబు మోసపూరిత మాటలు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జమ్మలమడుగు దీక్షలో మాజీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కోఆర్డినేటర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. 

జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిల ఫ్యాక్షన్‌ గొడవల్లో నలిగి అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఉక్కు పరిశ్రమ వస్తే ఫ్యాక్టన్‌ తగ్గి అందరికీ ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉక్కు పరిశ్రమపై నాలుగేళ్ల పాటు తెలుగుదేశం స్పందించకుండా నిద్రపోతుందా అని ప్రశ్నించారు. ఏడేళ్లుగా ఎంపీగా కొనసాగుతున్న సీఎం రమేష్‌నాయుడు ఏనాడైనా పార్లమెంట్‌లో ఉక్కు పరిశ్రమపై ప్రస్తావించారా అని నిలదీశారు. చిత్తశుద్ధి లేని దీక్షలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి పోరాటం చేస్తున్నారన్నారు. జిల్లా ప్రజలు టీడీపీ నాటకాలను నమ్మే పరిస్థితుల్లో లేరని, త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారన్నారు. 
 
Back to Top