రిమ్స్‌ బాధితులకు వైయస్‌ఆర్‌సీపీ నేతల పరామర్శ


శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని రిమ్స్‌లో ఇంజక్షన్‌ వికటించిన మృతి చెందిన, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పరామర్శించారు.  పలువురు మృతి చెందడంతో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండు చేశారు.ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ నాయకులు రెడ్డిశాంతి  మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి 35 లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో రిమ్స్‌ ఆసుపత్రిని నిర్మించారన్నారు. ఈ రోజు జరిగిన సంఘటన గత నాలుగు సంవత్సరాల టీడీపీ పాలనకు నిదర్శనమన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డికి మంచిపేరు వస్తుందని ఈ ఆసుపత్రిలో వైద్యులను నియమించడం లేదన్నారు. ప్రజల సమస్యలు, ఆరోగ్యం టీడపీఈకి పట్టడం లేదని విమర్శించారు.  ఘటనపై బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. 
 
Back to Top