పోలీసులు పచ్చ చొక్కాలేసుకొని ఉద్యమాన్ని అణిచే ప్రయత్నం


కర్నూలు: చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు పచ్చ చొక్కాలేసుకొని ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణిచే ప్రయత్నం చేశారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు బీవై రామయ్య, ఐజయ్య, కాటకాని రాంభూపాల్‌రెడ్డి, హాఫీజ్‌ఖాన్‌ మండిపడ్డారు. కర్నూలులో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. హోదా పోరాటంలో వైయస్‌ఆర్‌సీపీ సైనికుడు అశువులు బాయటం బాధాకరమని అన్నారు. దుర్గారావుది మరణం కాదని, చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్య అని విమర్శించారు. ఒక్క రోజు బంద్‌తో హోదా వస్తుందన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు. ఫిరాయింపుతో వచ్చిన పదవి శాశ్వతం కాదని  అఖిలప్రియ గుర్తించుకోవాలని హితవు పలికారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని దుయ్యబట్టారు. 
 
Back to Top