గిరిజనుల హృదయాల్లో వైయస్‌ఆర్‌ చెరగని ముద్ర

రాజన్న బిడ్డ వస్తేనే రాష్టం అభివృద్ధి
వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర
విజయనగరంః అభిమానం, నమ్మకంతో ప్రజలందరూ వైయస్‌ జగన్‌ వెంట నడుస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. గిరిజనులను ఆదుకున్న వ్యక్తి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని అన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి గిరిజనుల హృదయాల్లో ముద్ర వేసుకున్నారని,అలాగే రాజన్న బిడ్డ వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే తమకు మేలు జరుగుతుందని మళ్లీ రాజన్న రాజ్యం చూస్తామన్న విశ్వాసంతో గిరిజనులు ఉన్నారన్నారు. తాగునీరు, సాగునీరు, రోడ్లు, పింఛన్లు, రేషన్లు, గృహాలు  వంటి సకల అభివృద్ధి,సంక్షేమ పథకాలు వైయస్‌ఆర్‌ అమలు చేశారని గుర్తుచేశారు. 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం కొండలపై మారుమూల గ్రామాల నుంచి జననేతను చూడడానికి గిరిజనులు వస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం  ప్రజలను మోసగించే చర్యలకు పాల్పడుతుందన్నారు. ఎన్నికల దగ్గర పడటంతో మళ్లీ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మాయచేయడానికి ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top