బాబుది కపట ప్రేమ


చిత్తూరు: మైనారిటీల పట్ల చంద్రబాబు కపట ప్రేమ చూపుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ మైనారిటీ నాయకులు రహిమాన్‌ మండిపడ్డారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ముస్లింలకు ఎలాంటి మేలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తలాక్‌ బిల్లుపై టీడీపీ రాజ్యసభలో వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. ఎన్నికలకు ముందుకు మైనారిటీలకు 8 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ముస్లిం మత గురువును మసీదులో హత్య చేయడం బాధాకరమన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ హయాంలోనే మైనారిటీలకు మేలు జరిగిందని, 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మహానేతదే అని కొనియాడారు. మళ్లీ మనకు మేలు జరగాలంటే ఒకే ఒక మార్గం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్యాకెజీ కళ్యాన్‌ను ఎవరు నమ్మెద్దని సూచించారు. ముస్లింలకు బిర్యాని ఇస్తే ఓట్లు వేస్తారన్నది చంద్రబాబు ఆలోచన అన్నారని, ముస్లింలు అలాంటి వారు కాదని నిరూపించాలన్నారు.  వైయస్‌ జగన్‌కు అండగా నిలుద్దామని రహిమాన్‌ పిలుపునిచ్చారు.
 
Back to Top