ఇళ్ల తొలగింపును అడ్డుకున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు

పశ్చిమగోదావరిః పేదవేగి మండలం సూర్యరావుపేటలో   ఇరిగేషన్‌ భూములను ఆక్రమించారంటూ ఇళ్లను తొలగించేందుకు అధికారుల యత్నాలకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు అడ్డుకుని బాధితులకు అండగా నిలిచారు. కోర్టు స్టే ఉందని చెప్పుతున్న అధికారులు పట్టించుకోకుండా తొలగింపు ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమను టీడీపీలోకి చేరాలని ఎమ్మెల్యే చింతమనేని ఒత్తిడి చేశారని, టీడీపీలోకి చేరనందుకే తమపై కక్ష సాధిస్తున్నారంటున్న బాధితులు తెలిపారు.వైయస్‌ఆర్‌సీపీ నేతలు ు కొఠారు అబ్బాయిచౌదరి, రామచంద్రరావు మాట్లాడుతూ  చింతమనేని ఆగడాలు మితిమీరిపోతున్నాయని, పశ్నించేవారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు..తీరు మార్చుకోకుంటే తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు.

తాజా ఫోటోలు

Back to Top