గురువులను సైతం మోసం చేసిన ఘనత బాబుదే



- టీచర్ల అక్రమ అరెస్టులు దారుణం
–టీచర్లను పోలీసు స్టేషన్లలో బంధించిన దుర్మార్గ ప్రభుత్వమిది
– ధర్నాకు వెళ్తే సస్పెండ్‌ చేస్తామని బెదిరింపులు 
– టీచర్ల బదిలీలను కూడా ఆదాయ వనరుగా చూస్తున్నారు
విజయవాడ: చంద్రబాబు అందరినీ మోసం చేశారని, చదువులు చెప్పే గురువులను సైతం మోసం చేసిన ఘనత చంద్రబాబుదే అని  వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పేర్ని నాని విమర్శించారు.  టీచర్లను పోలీసు స్టేషన్లలో బంధించిన దుర్మార్గ ప్రభుత్వమిదని మండిపడ్డారు. మహిళా టీచర్ల ఇళ్లకు వెళ్లి పోలీసులు బెదిరించడం, ధర్నాలో పాల్గొనకుండా టీచర్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైయస్‌ఆర్‌సీపీ ఖండిస్తుందన్నారు. ఇన్నాళ్లు రైతులను, మహిళలను, నిరుద్యోగులనే చంద్రబాబు మోసం చేశారని విమర్శించే వారని, చివరకు చదువులు చెప్పే గురువులను కూడా వదల్లేదని ఆయన మండిపడ్డారు. చదువు చెప్పిన గురువుకు అబద్ధం చెప్పకూడదని బడిలో పాఠాలు చెబుతారన్నారు. చంద్రబాబు ఎక్కడ చదువుకున్నారో తెలియదని, ఆయనకు టీచర్లను గౌరవించాలన్న జ్ఞానం లేకుండా పోయిందన్నారు. ఏపీలో 22 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇటీవల 10 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇప్పుడేమో ఆర్థిక శాఖ ఒప్పుకోవడం లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు మాట తప్పారన్నారు. ప్రతి ప్రకటన మోసపూరితం, ఎత్తుగడులే అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని డీఎస్సీ ఇస్తామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లు చంద్రబాబు నిద్రపోయి..ఇవాళ నటిస్తూ మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. కృష్ణానదిలోని ఇసుకను, చెరువుల్లోని మట్టిని ప్రభుత్వం దాయ వనరులుగా చూస్తుందన్నారు. టీచర్ల బదిలీలను కూడా టీడీపీ నేతలు ఆదాయ వనరులుగా చూస్తున్నారని విమర్శించారు. బదిలీల కోసం ముఖ్యమంత్రి ఫేషీలోనే డబ్బులు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. అంతర్‌ జిల్లాల బదిలీలు చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఇంతవరకు ¯ð రవేరలేదన్నారు. టీచర్ల బదిలీలు దొడ్డిదారిన జరుగుతున్నాయని విమర్శించారు. గురువుల ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదని, చంద్రబాబు రాబోయే కొద్ది నెలల్లోనే అనుభవిస్తారని హెచ్చరించారు. టీచర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండు చేసింది. 
 
Back to Top