రాజ్యాంగ స్ఫూర్తికి చంద్రబాబు తూట్లు...




వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం...
విజయవాడః  రాజ్యాంగ  ఆమోద దినోత్సవం సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ నాయకులు,శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.అనంతరం అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు నివాళర్పించారు. రెడ్‌ సర్కిల్,సీపీ కార్యాలయం మీదగా వైయస్‌ఆర్‌సీపీ ఆఫీస్‌ వరుకు భారీ ర్యాలీ  నిర్వహించారు.రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని  బాడవపేటలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు అంబేద్కర్‌ విగ్రహానికి నివాళర్పించి శిఖమణి సెంటర్‌ నుంచి బందరు రోడ్డు వరుకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం వైయస్‌ఆర్‌సీపీ నేతలు మాట్లాడుతూ రాజ్యాంగ స్పూర్తిని టీడీపీ నేతలు నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించాల్సిన టీడీపీ ప్రభుత్వం తూట్లు పోడుస్తుందని మండిపడ్డారు.ఏపీలో రాజ్యాంగం కనిపించడంలేదని, చంద్రబాబు ప్రత్యేక రాజ్యాంగంతో పరిపాలన చేస్తున్నాడని దుయ్యబట్టారు.రాష్ట్రంలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజాశ్రేయస్సును చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు.బైబిల్,ఖురాన్,భగవద్గీతలుగా పవిత్రంగా చూసుకోవాల్సిన రాజ్యాంగాన్ని టీడీపీ ప్రభుత్వం అంథపాతాళానికి తొక్కేసిందన్నారు. పరిపాలనను సొంత వ్యవస్థలా చేసుకుని చంద్రబాబు పాలన చేస్తున్నాడన్నారు.దళితులు,మైనార్టీలు,బలహీనవర్గాలు అవమానకరమైన రీతిలో రాష్ట్రంలో జీవిస్తున్నారన్నారు.అంబేద్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకురావాలంటే చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు పార్థసారధి, మేరుగ నాగార్జున, వెల్లంకి శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
Back to Top