వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే రాష్ట్రానికి మంచిరోజులు

విజయనగరంః జిల్లాలో అత్యంత మారుమూల ఆంధ్ర,ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కురుపాంలో జరగబోయే  వైయస్‌ జగన్‌ బహిరంగసభకు ప్రజలు తరలివస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత శత్రుచర్ల పరిక్షీత్‌ రాజు అన్నారు. సభలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏం మాట్లాడతారా అని ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారన్నారు. గుమ్మిడిగడ్డ రిజర్వాయర్‌ నిర్మించాలని, రావాడ రిజర్వాయర్‌ కుడికాల్వ మరమ్మతు పనులు పూర్తిచేయాలని తెలిపారు.వాటర్‌ లీక్‌ అవ్వడంతో పంటపొలాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. అధికారులకు, ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదన్నారు.ఎవరైనా చనిపోతే పోస్టుమార్టం ప్రక్రియకు ఇబ్బందులు పడాల్సివస్తుందన్నారు. పార్వతీపురం వెళ్ళాల్సివస్తుందన్నారు.తిత్లీ తుపాన్‌ ప్రభావంతో కురుపాం నియోజకవర్గంలో సుమారు 8వేల ఎకరాలు అరటిపంటకు నష్టం వాటిల్లిందన్నారు. అరకొరగా నష్టపరిహారం మంజూరు చేశారన్నారు. పలు సమస్యలను వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. జననేత నాయకత్వంలోనే కురుపాం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు.వైయస్‌ఆర్‌సీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top