<br/>రాజమండ్రి: పోలవరం ప్రాజెక్టు అవినీతిమయమైందని, చంద్రబాబు మాయ చేస్తున్నారని ప్రత్యేక హోదా సాధనకు ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. కొత్త నిర్మాణ సంస్థకు మూడు రెట్లు రేట్లు పెంచి దోచుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని చంద్రబాబు ముడుపుల కోసం తీసుకున్నారన్నారు. కేంద్రమే పోలవరాన్ని 2019 లోగా నిర్మించాలని ఆయన డిమాండు చేశారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని, రైల్వేజోన్ కోసం, ప్రత్యేక హోదా సాధనకు మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.