ప్రభుత్వ నిర్ణయాల వల్లే మత్స్యకారుల జీవితాల్లో మార్పు


మోపిదేవి వెంకటరమణ
తూర్పు గోదావరి: ప్రభుత్వ నిర్ణయాల వల్లే మత్స్యకారుల జీవితాల్లో మార్పు వస్తుందని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మత్స్యకారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కుల వృత్తులపై ఆధారపడి అతిక్లిష్టమైన, దుర్భర జీవితం సాగించేంది మత్స్యకారులే అన్నారు. వేటకు వెళ్లే భర్త ఇంటికి తిరిగి వస్తాడో? లేడో అని ఆడబిడ్డలు కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్లే వారి జీవితాల్లో మార్పులు వస్తాయన్నారు. 2003లో విశాఖలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇలాంటి çసమావేశం ఏర్పాటు చేసి అక్కడ తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు మత్స్యకారులకు అందుతున్న సంక్షేమ ఫలాలు అని గుర్తు చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగేందుకు వెళ్తే ఆయన తాట తీస్తానని బెదిరించారన్నారు. ఒక్క వాగ్ధానం కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ సామాజిక వర్గంలో ప్రజలు నమ్మిన వ్యక్తికి అండగా నిలబడేందుకు ఎంతవరకైనా పోరాడే మనస్తత్వం ఉన్న సామాజిక వర్గం మత్స్యకారులది అన్నారు. చంద్రబాబు చేసిన మోసాలను చూసి కసిగా గుండెల్లో దాచుకున్నామన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత మా సమస్యలకు పరిష్కారం చూపుతారని ఈ వర్గమంతా మీ వైపు చూస్తున్నారని మోపిదేవి పేర్కొన్నారు. నరసాపురం సభలోనే చాలా హామీలు ఇచ్చారని, ఇక్కడ వెలుగు చూపిన సమస్యలు కూడా అమలు చేయాలని కోరారు. 
 
Back to Top