ఏపీలో ప్రజాస్వామ్యానికి పాతర..

విజయవాడః ఏపీలో ప్రజాస్వామ్యం లేదని మరోసారి రుజువైందని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. మనం భారత్‌లో ఉన్నామా? పక్కదేశంలో ఉన్నామా అని ప్రశ్నించారు. శాంతిభద్రతల వైఫల్యాన్ని ప్రశ్నించడం తప్పా అని అన్నారు. జగన్‌పై హత్యాయత్నం కేసుపై విచారణ చేస్తారని చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు.ప్రభుత్వ అవినీతి ప్రజలకు తెలియకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.

ప్రతిపక్ష నేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రధాన సూత్రధారుడని, ఈ కుట్రలో ఆయనే కర్త, కర్మ, క్రియా అని  పేర్కొన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రతో వైయ‌స్‌ జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఈ కుట్ర చేశారని వారు ఆరోపించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు పెద్దలు భాగం కాబట్టి వారు జరిపే దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపితేనే నిజాలు బయటకొస్తాన్నారు.
Back to Top