ఏపీ హైకోర్టు విభజనకు రాష్ట్ర ప్రభుత్వమే అఫిడవిట్‌ ఇచ్చిందిఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విభజనకు రాష్ట్ర ప్రభుత్వమే అఫిడవిట్‌ ఇచ్చిందని వైయస్‌ఆర్‌సీపీ విజయవాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు కోటంరాజు వెంకటేశ్‌శర్మ పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో భవన నిర్మాణాలు లేకుండా హైకోర్టు తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా అఫిడవిట్‌ ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీకి హైకోర్టు వస్తే తనపై స్టేలు ఎత్తేస్తారని బాబు భయపడుతున్నారని విమర్శించారు. 
 
Back to Top