వంచన దినం.. టీడీపీ, బీజేపీ దించిన దినం కావాలి

విశాఖపట్నం: వంచన వ్యతిరేక దినం వచ్చే ఏడాదికి బీజేపీ, టీడీపీకి దించిన దినం కావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కరణం ధర్మశ్రీ అన్నారు. ఇది తెలుగు వారి తాలూకా దీక్ష అన్నారు. మొన్నే కొంగ జపం చేసిన చంద్రబాబు తిరుపతిలో దొంగ దీక్ష చేస్తున్నారన్నారు. విశాఖపట్నంలో జరిగే వంచన వ్యతిరేక దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇప్పటికీ ప్రజల గుండెల్లో దేవుడిగానే ఉన్నారని, ఆయన వారసుడు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి వచ్చే ఆదరణను మరువలేక దీక్ష అంటూ కపటనాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలంతా తిప్పికొట్టాలన్నారు. ప్రత్యేక హోదానే మన హక్కు.. ప్రత్యేక హోదా అనేది దిక్కు.. హోదా వస్తేనే మనందరికీ లక్కు అన్నారు. ఉత్తరాంధ్ర రైల్వేజోన్‌ ఎక్కడుందంటే బోన్‌లో ఉందంటున్నారు. రేపు ఓట్ల రూపంలో ప్రజలే అది బోన్‌లో ఉందో.. బయట ఉందో చూపిస్తారన్నారు. ఉత్తరాంధ్ర ప్యాకేజీ అన్నారు.. ముష్టి రూ. 50 వేలు 50 కోట్లు ఇచ్చినట్లుగా ఇచ్చి ప్యాకేజీకి చిన్న లీకేజీ ఇచ్చి మేనేజ్‌ చేస్తున్నారన్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా.. పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా.. వైయస్‌ జగన్‌ ఒక్కరితోనే సాధ్యమన్నారు. ఓట్ల రూపంలో ప్రజలు అస్త్రాలు తీసి.. బీజేపీ, టీడీపీ వస్త్రాలు ఊడగొట్టాలని సూచించారు.
Back to Top