బాబు పాలనలో మహిళలను పట్టించుకోవడం లేదు


విజయవాడ: చంద్రబాబు పాలనలో మహిళలను పట్టించుకోవడం లేదని వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లను చంద్రబాబు నీరుగార్చారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మహిళలకు చేయూతనిచ్చారని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి మహిళకు రూ.75 వేలు ఆయా కార్పొరేషన్‌ ద్వారా వైయస్‌ఆర్‌ చేయూత పథకం కింద అందజేస్తామని చెప్పారు.
 
Back to Top