తప్పుంతా చంద్రబాబుదే..


రాజమండ్రిః గొప్పలు, ప్రచారమే తప్ప ప్రజలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి టీడీపీ ప్రభుత్వానికి లేదని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు.పుష్కర ఘటనలో నూటికి నూరు శాతం తప్పంతా చంద్రబాబు నాయుడిదేనన్నారు. ఎంతో అర్భాటంగా నిర్మించిన విఐపి ఘాట్‌లో సాన్నం చేయకుండా çముహూర్తం అంటూ పుష్కరఘాట్‌లో సాన్నం చేయడం కోసం సామాన్య భక్తులను నిలుపుదల చేశారన్నారు. విఐపిలకే రక్షణ కల్పించారే తప్ప సామాన్య ప్రజలు గురించి ఆలోచన చేయలేదన్నారు. చంద్రబాబు తప్పుని మరుగున పెట్టి కంటితుడుపు చర్యగా నివేదిక ఇచ్చారన్నారు. ప్రభుత్వ లోపం కనిపించకుండా ప్రజలది, మీడియాదే పాపంగా చూపించారని విమర్శించారు.
 
Back to Top