నయవంచన పాలనకు చరమగీతం పాడదాం

ప్రకాశంః చంద్రబాబు నయ వంచన పాలనకు తెరపడబోతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత ఇక్భాల్‌ అన్నారు. వైవి సుబ్బారెడ్డి పాదయాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు నానాకష్టాలు అనుభవిస్తున్నారని  నరకాసుర నారా వారి పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధం ఉన్నారన్నారు. చంద్రబాబు ఎన్ని కేసులయినా మేనేజ్‌  చేయవచ్చని కాని ప్రజలను మాత్రం మేనేజ్‌ చేయలేరన్నారు.  150 సీట్లు, 25 ఎంపీలను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.ప్రజా సమస్యలు, సంక్షేమం అజెండాగా వైయస్‌ జగన్‌ పాలనకు శ్రీకారం చుట్టబోతున్నారన్నారు. 
Back to Top