వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడి మృతి

అనంత‌పురం:  కూడేరు మండల పరిధిలోని ఇప్పేరుకు చెందిన వైయ‌స్ఆర్‌ సీపీ నాయకుడు మల్లికార్జున రెడ్డి (60) సోమవారం వేకువ జామున గుండె పోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మండల వైయ‌స్ఆర్‌  సీపీ నాయకులతో కలసి మృతుని కుటుంబాన్ని సందర్శించారు. మృతునికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మతో పాటు వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Back to Top