టెక్కలి: వైయస్ జగన్‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోంది. ఆచరణకు సాధ్యం కాని మాటలు చెప్పి ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలను దోపిడీ చేస్తూ తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే ప్రయోజనాలు జరిగేలా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. వైయస్ జగన్ ధైర్యవంతుడిగా ప్రజల కష్టాల్లో పాల్గొంటూ అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. మొక్కవోని దీక్షతో రాజన్న ఆశయ సాధన కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన నాయకుడు వైయస్ జగన్ అని గుర్తు చేశారు. అన్ని సామాజిక వర్గాలను చంద్రబాబు మోసం చేశాడని మండిపడ్డారు. కలిసికట్టుగా ధృడచిత్తంతో పనిచేస్తే వైయస్‌ఆర్ సీపీ విజయం సాధిస్తుందన్నారు. చేయి చేయి కలిపి కలిసికట్టుగా పనిచేసి వైయస్‌ఆర్ సీపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు.