<br/><br/> అమరావతి: అభిమానులైతే కాళ్లకు దండాలు పెడతారు లేదంటే దండలు వేసి అభిమానం చాటుకుంటారు..అలా గాకుండా అభిమానులు హత్యాయత్నం చేస్తారా అని వైయస్ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ టీడీపీ నాయకులనుద్దేశించి ప్రశ్నించారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభిమాని అని టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.<br/>నిజా నిజాలు బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగితే సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమే అవుతుందని వ్యాఖ్యానించారు. <br/>