విజయవాడ: అగ్రిగోల్డు ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని బాధితులకు వడ్డీతో సహా చెల్లించాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ డిమాండు చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అగ్రి గోల్డు బాధితుల బాసట కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అగ్రి గోల్డు యాజమాన్యం మోసం కారణంగా 176 మంది ఆగ్రిగోల్డు బాధితులు చనిపోయారని, వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.