దాంట్లో ఎవరున్నా బతికి బట్టకట్టలేరుఊసరవెల్లిలా రంగులు మార్చుతున్న చంద్రబాబుఏపీ దోపిడీ దొంగలకు కేంద్రంగా మారిందికాంగ్రెస్కు చంద్రబాబు ఇప్పుడు నీతిరుపడయ్యాడా..?బాబు కనుసన్నల్లోనే జనసేన పార్టీ నడుస్తోందిప్రతిపక్షనేతపై పవన్‌వి అర్థం లేని ఆరోపణలుకేటీఆర్ వ్యాఖ్యలపై టీడీపీ, చంద్రబాబు సమాధానం చెప్పాలిహోదా విషయంలో బీజేపీ, టీడీపీ రెండూ మోసం చేశాయికాకినాడ వంచనపై గర్జన సభకు ప్రజలంతా కలిసి రావాలికాకినాడ: చంద్రబాబుది ధృతరాష్ట్రుడి కౌగిలి అని, అందులో ఎవరున్నా బతికి బట్టకట్టలేరని, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా సిద్ధపడతాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. నాలుగున్నరేళ్లుగా చంద్రాబు ఏ విధంగా ప్రజలను మభ్యపెడుతున్నారో.. ఊసరవెల్లి కంటే ఎక్కువగా రంగులు ఎలా మార్చుతున్నారో ప్రజలంతా గమనించాలన్నారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఇచ్చిన లేఖ ప్రథమమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారన్నారు. అదే వేదికపై రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని చెప్పిన చంద్రబాబు ఏపీకి వచ్చి తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్లు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని, దేశాన్ని రక్షించుకోవాలా..? తెలుగు‘దేశాన్ని’ రక్షించుకోవాలా..? బాబూ అని ప్రశ్నించారు. రాజకీయ అవసరాల కోసం బద్ధ శ్రతువైన కాంగ్రెస్‌తో చేతులు కలపడం వాస్తవం కాదా అని నిలదీశారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన చీకటి ఒప్పందాలు రోజుకొకటి బయట పడుతూనే ఉన్నాయన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్‌ను ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని అడిగారనే మాట వాస్తవమా.. కాదా..? చెప్పాలి. స్వయంగా కేటీఆర్ మీడియాకు వెల్లడించారని తెలుగుదేశం పార్టీ దీనికి వివరణ ఇవ్వాలి. – దేశాన్ని రక్షించుకోవాలని బీజేపీతో యుద్ధం అంటూ బిల్డప్‌లు ఇస్తున్న చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో ఎందుకు జతకట్టాలని అడిగావు. – మే 23న బెంగళూరులో కుమారస్వామి ప్రభుత్వం ప్రమాణస్వీకారంలో చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ రాహుల్‌తో మంతనాలు జరిపారు. ఆ తరువాత రాహుల్Sగాంధీ హైదరాబాద్‌కు వస్తే స్వయాన చంద్రబాబు కోడలును పారిశ్రామిక వేత్తల మీటింగ్‌కు పంపించారు. – నవంబర్ 1వ తేదీన రాహుల్‌తో కలిసి సేవ్ డెమోక్రసీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. దేశం తాలూకా రక్షణ కాదు.. తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీలోని దొంగలను వారిని రక్షించుకోవడమే పని. – సుజనా చౌదరిపై ఈడీ దాడులు జరిగి 5700కోట్ల రూపాయలు బ్యాంకులను మోసం చేశాడని తేలితే.. లేదు రాజకీయంగా దాడులు చేశారని మాట్లాడుతున్నారు. బీజేపీ, టీడీపీ కలిసి ఏ విధంగా దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారో, దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. – ఒక దర్యాప్తు సంస్థ వచ్చి రూ.5700 కోట్లు అని తేల్చితే కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారు. ఏపీని చంద్రబాబు దోపిడీ దారుల హబ్‌గా మారుస్తున్నాడు, అందుకే సీబీఐని కూడా రాకూడదని జీఓలు జారీ చేశారు. రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు చంద్రబాబూ? – రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని వైయస్‌ఆర్ సీపీ మొదటి నుంచి పోరాటం చేస్తోంది. ఏరోజు అయితే హోదా కాదు.. ప్యాకేజీ మేలని చంద్రబాబు ప్రకటించాడో ఆ మరుసటి రోజే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడలో యువభేరి పెట్టి హోదా గళం ఢిల్లీకి వినిపించారు. ఆ తరువాత కలెక్టరేట్ ముందు ధర్నా చేశాం. – విజయనగరంలో ధర్మపోరాట సభ అని అధర్మ సభ పెట్టిన చంద్రబాబు బీజేపీతో వైయస్‌ఆర్ సీపీకి అక్రమ సంబంధం అంటగట్టాలని చూశాడు. – వైయస్ జగన్‌కు భారతీయ జనతా పార్టీ అంటే భయం అంటున్నారు. బీజేపీని చూస్తే భయపడేది చంద్రబాబే, కాబట్టే అక్రమంగా కాంగ్రెస్‌తో కలిశాడు. – వైయస్ జగన్ ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే పోరాడారు. – ఆగస్టులో తెలుగుదేశం పార్టీపై కాంగ్రెస్ చార్జిషీట్ విడుదల చేశారా.. లేదా..? చంద్రబాబు అవినీతిని వివరించారా.. లేదా..? దీనిపై సమాధానం చెప్పాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నీతివంతమైన పార్టీ అయిపోయిందా..?– వైయస్‌ఆర్ సీపీ ఉనికి, వైయస్ జగన్ ఉనికి దెబ్బతీయాలని ఎన్ని కుయుక్తులు పన్నినా వృథానే అవుతుంది. ఆంధ్రరాష్ట్ర ప్రజలంతా వైయస్ జగన్ నాయకత్వాన్ని ప్రజలంతా కోరుకుంటున్నారు. – కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జనసేన కూడా మద్దతు ఇచ్చి గెలిపించండి అని చంద్రబాబు మాట్లాడిన మాటలను ప్రజలంతా చూశారు. జనసేన పార్టీ నిర్ణయాన్ని కూడా చంద్రబాబు రూపొందిస్తున్నారని అర్థం అవుతుంది. – పవన్ కల్యాణ్ దీనిపై విచారణ ఏంటీ..? తెలంగాణలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ విధానాన్ని స్పష్టంగా చెప్పాం. మోసకారి చంద్రబాబును మాత్రం నమ్మొద్దని చెప్పాం. – జనసేనతో టీడీపీ చీకటి ఒప్పందాలు, కలయికలు, స్నేహాలు చంద్రబాబు బయటపెడుతున్నారు. – 22 రోజులుగా పవన్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రోజు ఉదయం టీవీల్లో చూస్తున్నట్లు ప్రవచనాలు చెబుతున్నారు. – రాజకీయాలు సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని పవన్ తెలుసుకోండి. రాజకీయాల్లో మాట్లాడిన ప్రతి మాటకు నిబద్ధత ఉండాలి. ఆలోచించుకొని మాట్లాడాలి. – చంద్రబాబు దోపిడీ దారులను నా వాటా సరే ప్రతిపక్ష పార్టీకి ఇచ్చావా అని అడుగుతున్నారంట. ప్రతిపక్ష నాయకుడినే అడిగిన వ్యక్తి మిత్రపక్షం పవన్‌కు ఇచ్చావా అని అడగడా..? నాలుగేళ్లు ఇదే పంపకాలతో వెళ్లారా..? వాటాల్లో విభేదాలు వచ్చి బయటకు వచ్చారా.. ? ఏం మాటలు పవన్ కల్యాణ్. – ఏ రోజు అయితే టీడీపీ ప్రమాణస్వీకారం చేసిందో ఆ రోజు నుంచి ఇసుక దోపిడీ చేస్తున్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోరాటాలు చేస్తుంటే పవన్ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. – విషజ్వరాలతో మనుషులు చనిపోతే ఆ ప్రాంతాల్లో వైయస్ జగన్ పర్యటించారు. ఆ తరువాత ప్రభుత్వం స్పందించింది. ఇది మరిచిపోయారా పవన్.– రైతులకు గిట్టుబాటు ధర లేకుంటే వైయస్‌ఆర్ సీపీ ఆందోళన చేస్తే, ప్రతిపక్ష నేత స్వయంగా మార్కెట్ యార్డు్డలకు వెళ్లారు. అప్పుడు ప్రభుత్వం కళ్లు తెరిచింది ఇది వాస్తవం కాదా..? – ప్రజాస్వామ్యం, గుండె ధైర్యం, మగతనం అంటూ పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం అసెంబ్లీకి వెళ్లలేదని కూడా మాట్లాడుతున్నారు. – ప్రతిపక్షం అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదో మీకు తెలియదా పవన్? 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుక్కొని, వారిలో నలుగురిని మంత్రులను చేస్తే ఏనాడైనా తప్పని మాట్లాడావా..?– దేశంలో రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేయకుండా ఇంకో పార్టీకి ఒత్తాసు పలికింది జనసేన కాదా..? ఇది ప్రజాస్వామ్యమా..? – కుల రహితం అంటూనే పవన్ కల్యాణ్ కులాల గురించి మాట్లాడుతున్నాడు. కులరహితం అన్న వ్యక్తికి కులాల సమావేశాలు ఎందుకు. నా విధానం ఇది అని ప్రజలతో మమేకం కావాలి. జుట్టు పీక్కుంటూ చిందరవందరగా మాట్లాడితే ప్రజలు హర్షించరు. – రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒకటే సంజీవని అని వైయస్‌ఆర్ సీపీ మొదటి నుంచి చెబుతుంది. – తూర్పుగోదావరి కాకినాడను తీసుకుంటే 2014 ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాను అని చెప్పారు.. నాలుగు సంవత్సరాలు బీజేపీతో కలిసి కాపురం చేశారు. ఏమైంది. దొంగ దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. కొత్తగా కాంగ్రెస్‌తో జతకట్టారు. – నౌకా నిర్మాణ పరిశ్రమ, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్కు, తెలుగు విశ్వవిద్యాలయం, కొబ్బరిపీచు ఆధారిత పరిశ్రమ, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్, భూమి ఉపరితల జల మార్గాల ఏర్పాటు ఇన్ని హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా..? – చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరాలంటే ప్రత్యేక హోదా కావాలి. హోదా వస్తే చంద్రబాబు దేశాలు తిరగాల్సిన అవసరం లేదు. పారిశ్రామిక వేత్తలే వస్తారు. – తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రచారానికి చంద్రబాబుకు అనుమతి ఇవ్వలేదంట. కేటీఆర్ రోడ్ షో చేస్తున్నారని చంద్రబాబు రోడ్‌షోకు పర్మిషన్ ఇవ్వలేదంట. – పదేళ్లు ఉమ్మడి రాజధాని అని చట్టంలో పెట్టారో.. ఆ హక్కులను ఓటుకు కోట్ల కేసులో దౌర్భాగ్య పరిణామం వల్ల కోల్పోయాం. చంద్రబాబు తన స్వార్థం కోసం ఐదు కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజల గౌరవాన్ని తాకట్టుపెట్టాడు. దయచేసి రాష్ట్ర ప్రజానికం అప్రమత్తంగా ఉండాలి. – వైయస్‌ఆర్ సీపీ పోరాటాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. కాకినాడలో వంచనపై గర్జన కార్యక్రమంలో అందరూ పాల్గొని హోదా సెగ ఢిల్లీకి తాకేలా చేయాలి. హోదా కలిసి పోరాడే ప్రతి పార్టీని కలుపుకొని పోతామని బొత్స సత్యనారాయణ చెప్పారు.