చంద్రబాబుకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?

హైదరాబాద్‌: చంద్రబాబుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజలను ఎందుకు అంత మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 2004లో తోటపల్లి రిజర్వాయర్‌కు చంద్రబాబు మూడు ఇటుకలతో శంకుస్థాపన చేసి వదిలిపెట్టారన్నారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం 96 శాతం పనులు పూర్తి చేస్తే..మిగిలిన నాలుగు శాతం పనులు నాలుగున్నరేళ్లు అవుతున్నా పూర్తి చేయకపోవడం దుర్మార్గం కాదా అని నిలదీశారు. 
 
Back to Top