టీడీపీ అరాచకాలను ఎండగట్టాలి


గుంటూరు: తెలుగుదేశం పార్టీ అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉండాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ బూత్‌ కమిటీ సభ్యులకు సూచించారు. గుంటూరులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ కమిటీ శిక్షణా తరగతులు రెండో రోజు కొనసాగుతున్నాయి. తరగతులకు ముఖ్యఅతిథులుగా పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రావి వెంకటరమణ, శ్రీకృష్ణదేవరాయలు, ఆది శేషగిరిరావు, కిలారి రోషయ్య, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తాఫాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయానికి బూత్‌ కమిటీల పాత్రే కీలకమన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 
Back to Top