చంద్రబాబు ప్రచార పైత్యం హద్దులు దాటుతోంది..

విజయనగరంః చంద్రబాబు ప్రచార ఆర్భాటాలపై  వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత  భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు.పుట్టిన బిడ్డలకు తన గురించి చెప్పాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు పబ్లిసిటీ తీవ్రస్థాయి చేరిందన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.చంద్రబాబు పైత్యం వింతపోకడలకు దారి తీస్తుందన్నారు.గత ఎన్నికలల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిన చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు.చంద్రబాబు మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబును చూసి రాష్ట్ర ప్రజలు పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.చంద్రబాబు భూమి మీద శాశ్వతంగా ఉండిపోతాననే భ్రమలో  ఉన్నారన్నారు.
 

Back to Top