ఏపీలో లక్షల కోట్ల అవినీతి...

ప్రజా కోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదు..
వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి
విజయనగరంః ఏపీలో లక్షల కోట్ల అవినీతి జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.టీడీపీ అవినీతిపై వైయస్‌ఆర్‌సీపీ మొదటి నుంచి పోరాటం చేస్తూనే ఉందన్నారు.మాజీ సీఎస్‌ అజయ్‌ కల్లాం వ్యాఖ్యలు ప్రభుత్వం అవినీతిని బట్టబయలు చేశాయన్నారు.రాజధాని,దీక్షలు, పోలవరం పేరుతో వేల కోట్లు టీడీపీకి నేతలకు దోచిపెట్టారన్నారు. అవినీతిపై కేంద్రప్రభుత్వం దర్యాప్తు చేస్తుందేమోనని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు.ప్రజల సొమ్మును వివిధ రాష్ట్రాల ఎన్నికలకు దారిమళ్లీంచి దోచిపెడుతున్నారని మండిపడ్డారు.ప్రజలు అశ్చర్యపోయే వాస్తవాలు బయటపడుతున్నాయన్నారు. ప్రజాకోర్డులో చంద్రబాబు ప్రభుత్వానికి శిక్ష తప్పదని హెచ్చరించారు.టీడీపీ కార్యకర్తలను సైతం చంద్రబాబు అవినీతిపరులుగా మార్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Back to Top