తిత్లీ బాధితులను ఆదుకోవడంలో బాబు విఫలం

  • ప్రచార అర్భాటమే తప్ప..సాయం ఏది..
  • వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి 
విజయనగరంః  తిత్లీ తుపాన్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబువి ప్రచార ఆర్భాటాలు మాత్రమే అని దుయ్యబట్టారు. బాధిత ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోయిన ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. తూతూ మంత్రంగా ప్రకటనలు ఇస్తూ కంటితుడుపు చర్యలు చేస్తుందని విమర్శించారు. తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు .సాయం అందకపోవడంతో ప్రభుత్వంపై ప్రజలు తిరబడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు వెళ్ళి సమస్య పరిష్కారం అయ్యేవరుకూ అక్కడే ఉన్నా .బాధితులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు. తూపాన్‌ను కూడా చంద్రబాబు నాయుడు తన స్వార్థరాజకీయాలను ఉపయోగించుకుంటూ ప్రతి రోజు ప్రకటనలు చేయడం, సమీక్షలు నిర్వహించడమే తప్ప  బాధిత కుటుంబాలను ఆదుకోవాలనే కనీస ధర్మాన్ని మరిచిపోయారన్నారు. దాదాపు ఆరు నియోజకవర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారని, లక్షలాది ఎకరాలు కొబ్బరి,జీడి,మామిడి తోటలు నేలకొరిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లినా పట్టించుకోవడంలేదన్నారు. నాలుగురోజులకు బాధితులకు తాగునీరు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం తమ బృందాలను పంపలేదన్నారు.విపత్తుకు ముందే ప్రభుత్వం ముందుస్తు చర్యలు తీసుకోకపోవడం వలనే తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top