టీడీపీకి ఓటమి తప్పదు..

చంద్రబాబు రాక్షస రాజకీయాలకు అంతం..
ప్రజా సంక్షేమమే జననేత లక్ష్యం..
వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి 
విజయనగరంః చంద్రబాబు ప్రభుత్వం రాక్షస రాజకీయాలు చేస్తోందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు.ఓటమి తప్పదని భయపడి దారుణాలకు తెగబడుతోందన్నారు. ప్రజా సంక్షేమమే వైయస్‌ జగన్‌ లక్ష్యమని తెలిపారు. వైయస్‌ జగన్‌కు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు. ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తూ సమస్యలు వింటూ ప్రజల్లో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భరోసా కల్పిస్తున్నారన్నారు. హత్యాయత్నం నుంచి బయటపడి జగన్‌ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే జననేత తమ కష్టాలు తీరుస్తారనే ప్రగాఢమైన విశ్వాసంతో ప్రజల్లో  ఉందన్నారు. టీడీపీ కంచుకోటగా భావించే విజయనగరం జిల్లాలో వైయస్‌ జగన్‌ పట్ల ప్రజల ఆదరణ, విశేష స్పందన చూసి టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. ఓటమి తప్పదనే భయంతో వైయస్‌ జగన్‌పై హత్యాయత్నానికి కూడా టీడీపీ వెనుకాడలేదన్నారు.జననేత ఎప్పుడు వస్తారా అని ప్రజలు 15 రోజల నుంచి ఎదురు చూశారన్నారు. జగన్‌ త్వరగా కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆలయాలు,చర్చిలలో పూజలు, ప్రార్థనలు నిర్వహించారన్నారు.నేడు ప్రారంభమైన పాదయాత్రలో వేలాది మంది జననేతతో అడుగులు వేస్తున్నారన్నారు.
 
Back to Top