మానవరూపంలో ఉన్న మృగం చంద్రబాబు

చంద్రబాబు జీవితం మొత్తం రక్త చరిత్ర
హత్యాయత్నం ప్రచారం కోసం ప్రతిపక్షం చేసిందనడం సిగ్గుచేటు
45 ఏళ్ల క్రితం విద్యార్థి దశలోనే కులాల మధ్య కుంపటిపెట్టిన బాబు
వంగవీటి, ఐఏఎస్‌ రాఘవేంద్రరావు, దశరథరామ్‌ హత్యల వెనుక బాబు హస్తం
చంద్రబాబు డైరెక్షన్‌లోనే వైయస్‌ జగన్‌పై హత్యా ప్రయత్నం
పదవి కోసం ఎవరినైనా మట్టుబెట్టే క్రూరుడు చంద్రబాబు
ఉన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడు వైయస్‌ జగన్‌
హత్యాయత్నంపై సమగ్ర విచారణ జరగాలి
హైదరాబాద్‌: చంద్రబాబు జీవితం మొత్తం రక్త చరిత్రే.. ప్రతిపక్షనేతపై జరిగిన దాడి గురించి రవ్వంత కూడా మనిషిగా ప్రవర్తించకుండా మానవ మృగంలా మాట్లాడడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. జీవితమంతా నేర చరిత్ర కలిగిన చంద్రబాబు హింసకు వ్యతిరేకం అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కోట్లాది మంది ప్రజల ఆధరాభిమానాలు పొందుతూ.. ప్రజల కోసం సుమారుగా ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ప్రచారం కోసం చేసిన చర్యగా అభివర్ణిస్తూ హేళనగా మాట్లాడడం దుర్మార్గమని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పే సుద్దులన్నీ ఆయన్ను మోసే ప్రసార మాధ్యమాలు, పత్రికలు ఆకాశానికి ఎత్తుతున్నాయన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. భూమన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే..

45 ఏళ్ల క్రితం విద్యార్థి దశలోనే వెంకటేశ్వర యూనివర్సిటీలో రెండు కులాల మధ్య చిచ్చుపెట్టి ఆ అగ్గిలో చలికాసుకుంటూ ఎదిగిన చరిత్ర చంద్రబాబుది. కుల రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు. కులాల ద్వారా రాజకీయాల్లో చిచ్చులు రగిలించి ఆంధ్రరాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చేందుకు చూస్తున్న చంద్రబాబు శాంతిప్రవచనాలు వల్లించడం దుర్మార్గపు విషయం. చంద్రబాబు గతం, వర్తమానం రెండూ రక్తంతో తడిసిన విషయాలే. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చేసిన నేరాలు అన్నీ ఇన్నీ కావని, చరిత్ర పుటల్లో ఎక్కిన పేజీలంన్నింటినీ చంద్రబాబు చించివేస్తూ ప్రజలకు కనపడనివ్వకుండా ప్రసార మాధ్యమాలను అడ్డుపెట్టుకొని చేశారు. అవి దాగకుండా బయటకు వస్తున్నాయి. 

చంద్రబాబు రాజకీయాల తొలినాళ్లలోనే వ్యక్తిగత ప్రాబల్యం కోసం ఎన్టీఆర్‌ పంచన చేరాడు. కాపు ఉద్యమ నేత వంగవీటి మోహనరంగా హత్య వెనుక ప్రధాన పాత్ర చంద్రబాబుదే. ఈ విషయాన్ని ఆనాటి హోంమంత్రి హరిరామ జోగయ్య స్పష్టంగా తన పుస్తకంలో రాసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ అనే పత్రికలో వ్యంగ్యంగా వార్తలు రాస్తున్న జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య మనవడు దశరథరామ్‌ను హత్య చేయించడంలో చంద్రబాబు పాత్ర ఉంది. నిజాయితీ గల ఐఏఎస్‌ అధికారి రాఘవేంద్రరావు స్కూటర్‌పై వెళ్తుంటే లారీతో తొక్కించిన నేరస్తుడు చంద్రబాబు. 
 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా అనంతపురం జిల్లాలో 470కి పైగా ప్రత్యర్థులను హత్య చేయిస్తే ఆ హత్యలపై ఒక్క కేసు బనాయించకుండా.. ఆ శవాలు కూడా కనపడకుండా చేయడం వెనుక ఎవరి హస్తం ఉంది. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి వైయస్‌ రాజారెడ్డిని హత్య చేయించింది చంద్రబాబే. ఆ హత్య చేసిన హంతకులకు ఆశ్రయమిచ్చి నెల రోజులు తన ఇంట్లో పెట్టుకున్నాడు. తన అధికారం కోసం ఎవరినైనా మట్టుబెట్టేందుకు వెనుకంజే వేయని క్రూర మనస్తత్వం కలిగిన రాజకీయ రాక్షసుడు చంద్రబాబు. 

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యా ప్రయత్నం నూటికి నూరుపాళ్లు చంద్రబాబు డైరెక్షన్‌లో జరిగింది. వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టే పచ్చ చొక్కా వేసుకున్న డీజీపీ ఠాకూర్‌తో ఆ హత్యాప్రయత్నం చేసిన వ్యక్తి వైయస్‌ జగన్‌ అభిమాని అని ప్రచారం చేయిస్తున్నాడు. డీజేపీకి తోడు రాష్ట్రమంతా మంత్రులు దెయ్యాల్లా వ్యాపించి మాట్లాడుతున్నారు. 

అలిపిరిలో చంద్రబాబుపై బాంబు దాడి జరిగితే హుటాహుటిన అప్పటి ప్రతిపక్షనేత వైయస్‌ఆర్‌ తిరుపతి బయల్దేరి వచ్చారు. ఆయన వచ్చేంత వరకు చంద్రబాబును పరామర్శించే దిక్కు కూడా లేదు. స్విమ్స్‌ ఆస్పత్రికి వెళ్తే పట్టుమని 15 మంది కూడా పరామర్శించే వారు లేరు. వైయస్‌ఆర్‌ సానుభూతి ప్రకటించిన తరువాత గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసిన తరువాత టీడీపీ కూడా మేల్కొంది. అది సంస్కారం అంటే. మానవీయ విలువలు ఉన్న వ్యక్తి వైయస్‌ఆర్‌. 

ప్రతిపక్షనేతపై దాడి జరిగితే కనీస సానుభూతి కూడా లేదు. ఎందుకంటే హత్యాయత్నం చేసిన వ్యక్తివి నువ్వే కనుక చంద్రబాబు. ప్రతిపక్ష నేత ప్రాణం పోలేదనే బాధతో చంద్రబాబు ఉన్నాడు. కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబు స్నేహితులు. నిన్న చేసిన ప్రయత్నం విఫలమైందని, బెంబేలెత్తిపోయి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. వైయస్‌ జగన్‌ హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరినందుకు కూడా విమర్శ. 

ఒళ్లంతా గుండె కలిగిన నాయకుడు కాబట్టే గాయాన్ని కూడా లెక్కచేయకుండా కార్యకర్తలు అధైర్యపడతారని వైయస్‌ జగన్‌ హైదరాబాద్‌కు వచ్చారు. విశాఖలో చికిత్స చేయించుకుంటే మరోసారి యత్నం చేస్తారనే అనుమానం కూడా ఉంది. జననేతపై హత్యకు యత్నించిన నిందితుడు శ్రీనివాసరావు నూటికి నూరు శాతం టీడీపీకి చెందినవాడే.. అతన్ని వైయస్‌ జగన్‌ అభిమానిగా చిత్రీకరించే ప్రయత్నం టీడీపీ, ఎల్లోమీడియా చేస్తోంది. మొదట ఎల్లోమీడియా జనసేన పార్టీ వారు చేయించారని ప్రసారం చేశారు. ఆ తరువాత వైయస్‌ జగన్‌ అభిమాని అని మరో డ్రామా మొదలుపెట్టారు. నిందితుడు జేబులో పది పేజీల ఉత్తరం ఉందని మరో డ్రామా మొదలు పెట్టారు. పది పేజీల లెటర్‌ జేబులో ఉంటే  అది కనీసం నలగదా..? ఆ లేఖను పత్రికలకు ప్రదర్శించారు. సీఐఎస్‌ఎఫ్‌ వారికి అప్పుడే ఆ దుండగుడిని పరిశీలిస్తే ఒక్క కాగితం ముక్క కూడా దొరకలేదు. మూడు గంటల తరువాత టీడీపీ వారే లేఖ రాసి ఇచ్చారు. 

చంద్రబాబు పార్టీ నిందితుడు శ్రీనివాసరావు ఇంటికి లోన్‌ కూడా ఇచ్చారని తెలిసినా బయటకు రానివ్వకుండా చేశారు. వైయస్‌ జగన్‌ నవ్వుతూ పోయారని, ఆస్పత్రిలో దీనంగా పడుకొని ఉన్నాడని చంద్రబాబు మాట్లాడడం హేయనీయం. చంద్రబాబులా నటించే స్వభావం లేదు వైయస్‌ జగన్‌కు లేదు. మా నాయకుడికి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంది. గాయం తనకు సంబంధించిన వ్యక్తిగత విషయమని, ఎక్కడ అభిమానులు కన్నీరు పెట్టుకుంటారోనని వారికి ధైర్యం చెప్పి ఆస్పత్రికి వెళ్లారు. సొంత తమ్ముడిని రాజకీయంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా సర్వనాశనం చేసిన చరిత్ర చంద్రబాబుది. నారా రామ్మూర్తి నాయుడికి దీనావస్థకు చంద్రబాబు వైఖరే కారణం. ఏదేమైనా ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్‌ చేస్తున్నాం.  
 
Back to Top