టీటీడీ ఈవో చంద్రబాబు తొత్తు...

అవకతవకలపై ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలా..
రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డిలపై పరువు నష్టం దావా అనాలోచితం..
విజయనగరంః ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టీటీడీలో జరుగుతున్న అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.రమణదీక్షితులు,విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేయడం సరికాదన్నారు. అవకతవకలపై పశ్నించినవారిపై  కక్ష సాధింపుచర్యలకు దిగుతున్నారని భూమన మండిపడ్డారు.టీటీడీ ఈవో అక్కడ పాలనా వ్యవహారాల కంటే చంద్రబాబు తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారు. నేను టీడీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు మీ ఆరోపణలు,ధర్నాలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. మీరు చేస్తే ఒప్పు.మరొకరు చేస్తే తప్పా  అని దుయ్యబట్టారు. దమ్ముంటే నాపై, రమణదీక్షితులపై ఆరోపణలకు విచారణకు సిద్ధమా అని భూమన సవాల్‌ విసిరారు. అభరణాలు లెక్క అడిగితే పరువు నష్టం దావా వేయడం దుర్మార్గమన్నారు. ఈవో బాబుకు తొత్తుగా ఉన్నారే తప్ప భగవంతుడికి జవాబుదారీగా లేరన్నారు.రూ.200 కోట్లు దావా వేసి శ్రీవారికి విలువ కట్టే ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. దాదాపు 25 సంవత్సరాల పాటు ప్రధాన అర్చకత్వం వహిస్తున్న రమణదీక్షితులు టీటీడీ పాలనా వ్యవహారాల్లో అవినీతి జరుగుతుందని ఆరోపణ చేస్తే ఆయనను అర్చకత్వం నుంచి తొలగించడమే కాకుండా ఆయన మీద, ఆయనకు మద్దతుగా ఉన్న విజయసాయిరెడ్డిపై పరువు నష్టం దావా వేయడం అనాలోచితమన్నారు. 
 
Attachments area
Back to Top