పాదయాత్ర కాదు..చంద్రబాబుపై దండయాత్ర...

విజయనగరంః జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ఒక చ్రరిత అని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. ఇడుపుల పాయలో ప్రారంభించిన ప్రజా సంకల్పయాత్ర చ్రరితను తిరగరాస్తుందని పేర్కొన్నారు. ప్రజల కన్నీళ్లను తుడుస్తూ, భరోసానిస్తూ పాదయాత్ర సాగుతోందన్నారు. జిల్లాలు..నియోజకవర్గాలు దాటుతున్న కొద్ది విశేష ప్రజాదరణ వస్తుందని తెలిపారు. ఇది పాదయాత్రలా కాకుండా చంద్రబాబు మీద జరుపుతున్న దండయాత్రలా దిగ్విజయంగా సాగుతుందన్నారు. టీడీపీకి బలమై కంచుకోటగా చెప్పుకుంటున్న ఉత్తరాంధ్రలో జగన్‌మోహన్‌ రెడ్డికి పెనుసంచలనంగా ప్రజలు బ్రహ్మరథం పట్టడం టీడీపీ గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయని తెలిపారు. ఊహలకందని స్థాయిలో లక్షలాది ప్రజలు తరలివచారని పేర్కొంటూ  వైయస్‌ జగన్‌ పట్ల ప్రజలకు ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎప్పుడు వస్తారా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారన్నారు.మోసపూరిత హామీలు, వాగ్దానాలతో  ప్రజలను ఎంతగా మోసం చేశారనే వాస్తవం ప్రజా సంకల్పయాత్ర ద్వారా తేటతెల్లం అవుతుందన్నారు.  ఉత్తరాంధ్ర ప్రజలు వాస్తవాలను గ్రహించి మా కష్టాలు తీర్చే ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌ అని భావిస్తున్నారన్నారు. ప్రజల ఆశల్ని, ఆశయాల్ని నెరవేర్చగలిగే సమర్థనాయత్వ లక్షణాలు జగన్‌లోనే ఉన్నాయని ప్రజలు గ్రహించారన్నారు.
Back to Top