జైట్లీతో రాజీ ప్రయత్నాలు సిగ్గుచేటు

తిరుపతి: టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ద్వారా చంద్రబాబు జైట్లీతో రాజీ ప్రయత్నాలు చేయించడం సిగ్గు చేటు అని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు బండారం మరోసారి బట్టబయలు అయ్యిందని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు కలరింగ్‌ ఇస్తూ మరోవైపు బీజేపీతో రహస్య మంతనాల సారాంశం ఏంటని ప్రశ్నించారు. హోదా అంటునే కేంద్రంతో చంద్రబాబు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విడాకులు ఇవ్వడం పెళ్లి చేసుకోవడం చంద్రబాబుకు బాగా అలవాటైందన్నారు. 

 
Back to Top