దీక్షల పేరుతో టీడీపీ నేతల డ్రామాలుఅనంతపురం: టీడీపీ నాయకులు దీక్షల పేరుతో డ్రామాలాడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. గురువారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి కాపురం చేసి ఏపీకి ఏం సాధించారని ఆయన నిలదీశారు. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీకే ఎక్కువ ఇచ్చారని చంద్రబాబు ఊదరగొట్టారని, ఇప్పుడు మాట మార్చి ఏమీ చేయలేదని పేర్కొనడం సిగ్గుచేటు అన్నారు. నాలుగేళ్లలో ఏనాడు కూడా చంద్రబాబుకు, టీడీపీ నాయకులు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదని, ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయని ఇప్పుడు హడావుడిగా దొంగ దీక్షలు చేస్తే ప్రజలు నమ్మరన్నారు. హోదా కోసం మొదటి నుంచి వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారని  గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
Back to Top