వైయస్‌ఆర్ జిల్లా: నవరత్నాలతో పేద ప్రజలకు మేలు జరుగుతుందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. సిద్దపట్నం మండలం దిగువపేటలో ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన గడప గడపకూ వెళ్లి నవరత్నాల గురించి వివరించారు. అధికారంలోకి రావడం కోసం వందల కొద్ది హామీలిచ్చి వాటిల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. మళ్లీ అధికారం కోసం మరో టన్నుల కొద్ది హామీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని, దయచేసి ప్రజలు మరోసారి నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రజల కోసం తపించే ప్రజా నాయకుడు వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.